తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా పంపిణీకి వికేంద్రీకృత విధానం అవసరం'

కరోనా టీకా కొనుగోలులో కేంద్రీకృత విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ డిమాండ్​ చేశారు. టీకా పంపిణీకి మాత్రం వికేంద్రీకృత విధానం అవసరమని అభిప్రాయపడ్డారు.

rahul gandhi
రాహుల్​ గాంధీ

By

Published : May 14, 2021, 4:07 PM IST

కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్​ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. ప్రస్తుత విధానం అంతా సమస్యలమయం అని ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు.

"ప్రభుత్వ వ్యాక్సిన్ విధానంలో అన్నీ సమస్యలే ఉన్నాయి. వ్యాక్సిన్​ కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృతం చేయాలి. వ్యాక్సిన్​ పంపిణీని వికేంద్రీకృతం చేయాలి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

ప్రజలందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేయాలని కాంగ్రెస్​ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వ్యాక్సిన్​ విధానం.. వివక్షాపూరితంగా ఉందని విమర్శిస్తోంది.

ఇదీ చూడండి:'సీబీఎస్‌ఈ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు'

ఇదీ చూడండి:'మహా'లో బ్లాక్​ ఫంగస్​ పంజా.. 52 మంది మృతి!

ABOUT THE AUTHOR

...view details