తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'13 నగరాలకు 56.5 లక్షల డోసుల టీకా పంపిణీ!'

దేశవ్యాప్తంగా ఈ నెల 16న కొవిడ్​-19 వ్యాక్సినేషన్​ ప్రారంభం కానుంది. ఈ మేరకు పుణె కేంద్రంగా సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ఉత్పత్తి చేసిన ఆక్స్​ఫర్డ్​ కొవిషీల్డ్​ టీకాను ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరీ తెలిపారు.

Vaccine movement begins, 4 airlines to fly 56.5 lakh doses from Pune to 13 cities on Tuesday: Puri
'దేశంలో 13 నగరాలకు 56.5లక్షల డోసుల టీకా సరఫరా.!'

By

Published : Jan 12, 2021, 11:24 AM IST

దేశంలో కరోనాపై పోరాటానికి వ్యాక్సిన్​ ఉద్యమం ప్రారంభమైంది. ఆక్స్​ఫర్డ్​ 'కొవిషీల్డ్' టీకాను ఉత్పత్తి చేస్తోన్న సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా నుంచి మొత్తం 56.5లక్షల టీకా డోసులను వివిధ రాష్ట్రాలకు పంపనున్నట్టు పౌర విమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరీ తెలిపారు. పుణె కేంద్రంగా.. 13 నగరాలకు ఈ వ్యాక్సిన్​ సరఫరా కానుందని ట్విట్టర్​ వేదికగా ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:రానున్న నెలల్లో 30కోట్ల మందికి టీకా: మోదీ

"దేశంలో వ్యాక్సిన్​ ఉద్యమం ప్రారంభమైంది. పుణె నుంచి దిల్లీ, చెన్నైకి స్పైస్​ జెట్​, గో ఎయిర్​ విమనాలు బయల్దేరాయి. 'ఎయిర్​ ఇండియన్'​, 'ఫ్లై స్పైస్​జెట్'​, 'గోఎయిర్​లైన్స్​ ఇండియా', 'ఇండిగో6ఈ'లకు చెందిన 9 విమానాల ద్వారా.. దిల్లీ, చెన్నై, కోల్​కతా, గువాహటి, షిల్లాంగ్​, అహ్మదాబాద్​, హైదరాబాద్​, విజయవాడ, భువనేశ్వర్, పట్నా, బంగాల్​ ప్రాంతాలకు టీకా సరఫరా కానుంది."

- హర్​దీప్​ సింగ్​ పూరీ, పౌర విమానయాన మంత్రి

ఇదీ చదవండి:'టీకాల కోసం ప్రభుత్వం ఆర్డర్- ఒక్కోటి రూ.210'

తొలి విడతలో భాగంగా..

దేశ వ్యాప్తంగా ఈ నెల 16న కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రారంభం కానుండగా.. తొలివిడతలో భాగంగా పుణె నుంచి దిల్లీకి కొవిషీల్డ్​ టీకాను పంపినట్టు తెలిపారు అధికారులు. ఈ మేరకు స్పైస్​జెట్​ ద్వారా.. మొత్తం 34 పెట్టేల్లో 1,088 కిలోగ్రాముల వ్యాక్సిన్​ను.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సరఫరా చేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:తొలి దశలో టీకా ఫ్రీ- త్వరలో 4 వ్యాక్సిన్లు: మోదీ

ABOUT THE AUTHOR

...view details