Vaccine for 12-14 in India: 15 ఏళ్ల లోపు చిన్నారులకు టీకా పంపిణీ చేయనున్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. 12-14 ఏళ్ల టీనేజర్లకు టీకా ఇవ్వాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.
Union Health ministry 12 14 vaccination

మార్చి 15 నుంచి ఈ వయసు చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని జాతీయ కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోడా పేర్కొన్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఈ గ్రూప్ చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ చేయడంపై కేంద్ర వైద్య శాఖ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో 15-18 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సోమవారం అరోడా పేర్కొన్నారు. అదే నెలలో 12-14 ఏళ్ల వయసు పిల్లలకు టీకా పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:కరోనా విజృంభణ- భారత్లో ఒక్కరోజే 2.38 లక్షల కేసులు