తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రిటన్​ పౌరులపై భారత్​ ఆంక్షలు.. 10 రోజుల క్వారంటైన్​!

బ్రిటన్​ నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్​ను తప్పనిసరి చేయాలని (India UK quarantine rules) ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 4 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపాయి.

Vaccine verification
యూకే

By

Published : Oct 1, 2021, 8:27 PM IST

Updated : Oct 1, 2021, 9:12 PM IST

భారత్​ ప్రయాణికులపై బ్రిటన్​ ప్రభుత్వం (India UK quarantine rules) అమలు చేస్తున్న నిబంధనల తరహాలోనే కేంద్రం​ ఇప్పుడు బ్రిటన్​ నుంచి వచ్చే వారిపై విధించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్రిటన్ నుంచి వచ్చిన వారు టీకా తీసుకున్నా సరే 10 రోజుల పాటు హోం క్వారంటైన్​లో ఉండాల్సిందే (India UK quarantine rules) అని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. ఈ నెల 4 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపాయి.

ఈ నిబంధనల ప్రకారం బ్రిటన్​ నుంచి వచ్చే వారు ప్రయాణానికి ముందు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు (India UK quarantine rules) చేయించుకోవడం తప్పనిసరి. అదే విధంగా వారు భారత్​కు వచ్చి ఎనిమిది రోజులు పూర్తయ్యాక మరోసారి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

కొవిషీల్డ్​ను గుర్తింపుపై బ్రిటన్​ అనుసరిస్తున్న వైఖరికి బదులుగా భారత్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్‌ నుంచి బ్రిటన్‌ వెళ్లే వారికి 10రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు పెట్టిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. వాటిని తీవ్రంగా ఖండిస్తున్న భారత్‌.. అలాంటి నిబంధనలు వివక్షపూరితమేనని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి :కోర్టులపై రైతులు విశ్వాసం ఉంచాలి: సుప్రీం

Last Updated : Oct 1, 2021, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details