తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పని ప్రాంతాల్లో ఉద్యోగుల కుటుంబీకులకూ టీకా

ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లోనే వారి కుటుంబ సభ్యులకూ వ్యాక్సినేషన్​ అందించవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​.

Rejesh Bhushan, Central Health Secretary
రాజేశ్​ భూషణ్​, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి

By

Published : May 23, 2021, 6:46 AM IST

ఉద్యోగుల కోసం పారిశ్రామికవాడలు, పని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వారి కుటుంబ సభ్యులకూ టీకాలు అందించవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.

పారిశ్రామిక వాడలు, ప్రైవేటు సంస్థల పనిప్రదేశాల్లో.. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, వారిపై ఆధారపడిన వారికి వ్యాక్సిన్‌ అందించాలనుకుంటే ఆ సంస్థ యజమాని ఏ ప్రైవేటు ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నారో ఆ ఆసుపత్రే అందుకు తగ్గ డోసులను సేకరించుకోవాలి. ప్రభుత్వ సంస్థల పని ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత వ్యాక్సిన్లు వేయొచ్చు.

ఇదీ చదవండి:నేడు కేంద్ర విద్యాశాఖ కీలక సమావేశం

ABOUT THE AUTHOR

...view details