తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారికి టీకాలు వేయాలంటే.. 122కోట్ల డోసులు అవసరం  '

భారత్​లో 59 కోట్ల మధ్య వయస్కులకు టీకాలు వేయడానికి 122 కోట్ల డోసులు అవసరమవుతాయని సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. కరోనా నివారణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. వైరస్​ కట్టడికి పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అఫిడవిట్​ సమర్పించింది.

By

Published : May 2, 2021, 3:38 PM IST

Supreme on vaccine distribution
కరోనా టీకా పంపిణీపై సుప్రీం కోర్టు

దేశంలో 18-45 మధ్య వయసు జనాభా 59కోట్ల మంది ఉన్నారని, వారికి వ్యాక్సిన్​ పంపిణీ చేయడానికి 122 కోట్ల డోసులు అవసరమని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. ఈ మేరకు నివేదికను సమర్పించింది. కరోనా కట్టడికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. అందుబాటులో ఉన్న వనరుల సాయంతో పూర్తి సామర్థ్యంతో వీలైనంత త్వరగా లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది.

కరోనా వ్యాప్తి నియంత్రణకు సర్కారు ముందస్తు చర్యలు తీసుకుందని కేంద్రం పేర్కొంది. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​​ సహా ఇతర టీకాలకు అత్యవసర వినియోగానికి ఆమోదించినట్లు వెల్లడించింది. రష్యా వాక్సిన్​ స్పుత్నిక్​-వీ ఉత్పతికి భారత్​లోని డాక్టర్​ రెడ్డీస్​ ఫార్మా సంస్థకు అనుమతిచ్చినట్లు పేర్కొంది. జులై నుంచి ఈ టీకా ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపింది. అలాగే అమెరికా వ్యాక్సిన్​ ఫైజర్, మోడెర్నా టీకా తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ​పేర్కొంది.

దేశంలో కరోనా పరిస్థితిని సుమోటాగా తీసుకున్న సుప్రీం.. టీకా పంపిణీ, ఆక్సిజన్​ సరఫరాపై అఫిడవిట్​ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి:ఒడిశాలో 14 రోజులు పూర్తి స్థాయి లాక్​డౌన్​

ABOUT THE AUTHOR

...view details