తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ టెస్ట్​ లేకుండానే ఆ ప్రయాణికులకు అనుమతి!

విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేదుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రెండు టీకా డోసులు అందుకున్న ప్రయాణీకులు ఆర్టీ-పీసీఆర్ నివేదిక సమర్పించకుండానే ప్రయాణించే అంశంపై నిపుణులతో చర్చిస్తోంది. త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Vaccinated passengers may not need RT-PCR report for domestic travel
ఆర్టీ-పీసీఆర్ నివేదిక లేకుండానే ప్రయాణాలు!

By

Published : Jun 6, 2021, 10:06 PM IST

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ప్రయాణీకులు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ నివేదిక సమర్పించాలనే నిబంధనను తొలగించడంపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. ప్రయాణికుల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం అని తెలిపారు.

" కరోనా టీకా రెండు డోసులు పొందిన వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదిక అవసరం లేకుండానే విమాన ప్రయాణానికి అనుమతించే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది."

- హర్దీప్ సింగ్ పూరీ, పౌర విమానయాన శాఖ మంత్రి

అయితే ఈ నిర్ణయం విమానయాన శాఖ మాత్రమే తీసుకునేది కాదని.. హర్దీప్​సింగ్ పూరీ తెలిపారు. ఆరోగ్య నిపుణులతో సహా.. ఇతర నోడల్ ఏజెన్సీలు ప్రయాణీకుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేస్తాయన్నారు.

ప్రస్తుతం.. కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు దేశీయ ప్రయాణీకులను ఆర్టీ-పీసీఆర్ నివేదికను తప్పనిసరి చేశాయి. ఆరోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి.. రాష్ట్రాలకు ఆ హక్కు ఉందని పూరీ అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:హిందీ, ప్రాంతీయ భాషల్లోనూ 'కోవిన్'​ సేవలు​

'వ్యాక్సిన్ పాస్​పోర్ట్'​ అమలు సబబేనా?

ABOUT THE AUTHOR

...view details