MHA Jobs Notification: సెక్రెటరీ, మేనేజర్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ, అసిస్టెంట్ ఇంజినీర్, సీనియర్ అకౌంటెంట్ వంటి పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇందుకు సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(LPAI), ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల్లో(ICPs) గ్రూప్ ఏ,బీ,సీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
- ఎల్పీఏఐలో 15, ఐసీపీల్లో 34 కలిపి మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగలవారు జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలకు సంబంధించిన వివరాలు కింది ఫొటోలో చూడండి.
- గ్రూప్ బీ, సీ పోస్టుల కోసం అప్లై చేసేవారికి కంప్యూటర్‌పై కనీస అవగాహన ఉండాలి. ప్రత్యేకించి ఎంఎంస్ ఆఫీస్, ఈ-ఆఫీస్, ఈమెయిల్ గురించి తెలిసి ఉండాలి.
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://www.mha.gov.in/notifications/vacancies లింక్‌ను సందర్శించండి.
- అభ్యర్థులు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి. అలాగే పత్రాలను usgaadnm@lpai.goy.in ఐడీకి మెయిల్ చేయాలి.