తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మన్మోహన్ సింగ్​ను కలిసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య! - మన్మోహన్​ సింగ్​ న్యూస్

VP meets manmohan singh: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.. మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్​ అగ్రనేత మన్మోహన్​ సింగ్​ను కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన వెంకయ్య.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

venkaiah naidu meets manmohan singh
మన్మోహన్​ సింగ్​ను పరామర్శించిన ఉపరాష్ట్రపతి

By

Published : Aug 4, 2022, 9:36 PM IST

VP Meets Manmohan Singh: భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్​ను పరామర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గురువారం మన్మోహన్ నివాసానికి వెళ్లిన వెంకయ్య.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్​లో షేర్​ చేశారు. మన్మోహన్​ సింగ్ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. రాజస్థాన్​ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్​.. అనారోగ్య సమస్యతో వర్షాకాల సమావేశాలకు హాజరుకావడం లేదు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్​గా విధులు నిర్వర్తిస్తున్న వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల 10తో ముగియనుంది.

మన్మోహన్​ సింగ్​ను పరామర్శించిన ఉపరాష్ట్రపతి

ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో.. వీల్​ఛైర్​లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ అగ్రనేత మన్మోహన్‌ సింగ్‌. 89 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు పార్లమెంట్‌ భవనం వద్దకు వీల్‌ఛైర్‌లో వచ్చారు. అయితే, ఆయన అలా వీల్‌ఛైర్‌లో పార్లమెంట్‌ ఆవరణలో కనిపించడం అదే తొలిసారి. నలుగురు అధికారుల సాయంతో లేచి మన్మోహన్‌ సీక్రెట్‌ బ్యాలెట్‌ను బాక్స్‌లో వేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు కాంగ్రెస్‌ నేతలు, ఆయన మద్దతుదారులు ఆయన్ను అలా వీల్‌ఛైర్‌లో చూడటం బాధగా ఉందని.. ఆరోగ్యం త్వరగా బాగుపడాలని కోరుకొంటూ అనేక కామెంట్లు పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details