కేరళ సీఎం పినరయి విజయన్‌పై మండిపడ్డారు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్. విజయన్.. 'కొవిడియట్' అని ఘాటుగా విమర్శించారు. ఆయనకు కొవిడ్ సోకినప్పటికీ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు.
"కొవిడియట్ అర్థం ఏమిటో మీకు తెలుసు. కరోనా నిబంధనలు ఉల్లంఘించే ముఖ్యమంత్రికీ అదే పదం వర్తిస్తుంది. ఏప్రిల్ 4న కేరళ ముఖ్యమంత్రికి వైరస్ సోకినట్లు కాలికట్ వైద్య కళాశాల వైద్యులు నిర్ధరించారు. అయితే ఎలాంటి కొవిడ్ నిబంధనలు పాటించకుండా.. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు."అని మురళీధరన్ పేర్కొన్నారు.