Punjab DGP: సీనియర్ ఐపీఎస్ అధికారి వీరేష్ కుమార్ భవ్రాను పంజాబ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా(డీజీపీ) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల ప్యానెల్‌లోని వీరేష్ కుమార్ భవ్రాను ఎంపిక చేసింది చరణ్‌జిత్ సింగ్ చన్నీ సర్కార్. వీరేష్ కుమార్ భవ్రా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో.. భద్రతా వైఫల్యం దృష్ట్యా పంజాబ్ డీజీపీ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నామినేట్ చేసిన మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరు దినకర్ గుప్తా, మరొకరు ప్రబోధ్‌కుమార్. అయితే కొత్త డీజీపీగా ఎంపిక అయిన భవ్రా పదవీకాలం మరో రెండు సంవత్సరాలు ఉంది. అప్పటి వరకు ఆయన డీజీపీ పదవీలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.