తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ రాజకీయాల్లో ట్విస్ట్​- సీఎం క్విట్​ - trivendra singh rawat etv bharat

uttharakhand cm trivendra singh rawat to resign
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పు ఖాయం!

By

Published : Mar 9, 2021, 2:32 PM IST

Updated : Mar 9, 2021, 4:39 PM IST

16:36 March 09

'హైకమాండ్​ నిర్ణయంతో..'

పార్టీ అధిష్ఠానం నిర్ణయంతోనే తాను పదవి నుంచి తప్పుకున్నట్టు ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం.. గవర్నర్​ రాణి మౌర్యను కలిసిన ఆయన.. రాజీనామా లేఖను అందించారు. సీఎం బాధ్యతలు చేపడతానని తాను ఎన్నడూ అనుకోలేదని.. కానీ నాలుగేళ్ల పాటు పదవిలో ఉండే అవకాశం దక్కిందన్నారు. 

భాజపా శాసనసభా పక్ష సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని వెల్లడించారు త్రివేంద్ర.

16:19 March 09

త్రివేంద్ర రాజీనామా..

ఉత్తరాఖండ్​ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీఎం పదవికి త్రివేంద్ర సింగ్​ రావత్​ రాజీనామా చేశారు. గవర్నర్​ రాణి మౌర్యను కలిసి.. తన రాజీనామాను సమర్పించారు త్రివేంద్ర. గత కొంతకాలంగా.. రాష్ట్ర భాజపాలో నెలకొన్న అసమ్మతి కారణంగా.. త్రివేంద్ర పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

15:40 March 09

గవర్నర్​తో భేటీ...!

ఉత్తరాఖండ్​ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనపడనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​.. తన పదవికీ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మంగళవారం సాయంత్రం గవర్నర్​ను కలిసి రాజీనామాను అందజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆయన ప్రెస్​ మీట్​ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి.. త్రివేంద్ర.. తొలుత ప్రెస్​ మీట్​ నిర్వహిస్తారని.. అనంతరం గవర్నర్​ను కలుస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ ఆయన ముందు గవర్నర్​ను కలుస్తారని తాజాగా తెలుస్తోంది.

15:29 March 09

సీఎం నివాసానికి..

మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఒక్కొక్కరుగా రావత్​ నివాసానికి చేరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి ధన్​సింగ్​, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బన్​సిధర్​ భగత్​ ఇప్పటికే రావత్​ను కలిశారు.

మధ్యాహ్నం ప్రెస్​ మీట్​ నిర్వహించిన అనంతరం.. గవర్నర్​ను కలిసి రావత్​ తన రాజీనామాను అందజేస్తారని తెలుస్తోంది.

మరోవైపు రావత్​ మద్దతుదారులు కూడా ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.

14:27 March 09

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పు ఖాయం!

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​పై భాజపా నేతలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు త్రివేంద్ర ప్రేస్​ మీట్​ నిర్వహిస్తారని.. 4 గంటలకు గవర్నర్​ను కలిసే అవకాశముందని సమాచారం.

రేసులో ధన్​ సింగ్​...!

సీఎం రేసులో రాష్ట్ర మంత్రి ధన్​ సింగ్​ రావత్​, ఎంపీలు అజయ్​ భట్​, అనిల్​ బలుని ఉన్నట్టు తెలుస్తోంది. ఓ డిప్యూటీ సీఎంను కూడా నియమించే యోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం. పుష్కర్​ సింగ్​ ధమికి ఆ బాధ్యతలు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Last Updated : Mar 9, 2021, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details