ఉత్తర్ప్రదేశ్లో కదులుతున్న కారులో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం (uttar pradesh rape news) కలకలం సృష్టించింది. ఆగ్రా-దిల్లీ హైవేపై(agra delhi expressway) ఈ దారుణం జరిగింది. బాధిత యువతి ఎస్సై పరీక్షకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. దీనిపై ఆమె కుటుంబం కోసికల ఠాణాలో ఫిర్యాదు చేయగా.. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫేస్‌బుక్ పరిచయం.. నమ్మించి మోసం..
బాధిత యువతికి.. హరియాణాలోని పాల్వాల్కు చెందిన తేజ్వీర్ అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. కొన్నాళ్ల స్నేహం తర్వాత ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తాను ఆగ్రాలో ఎస్సై రాత పరీక్షకు(up police recruitment 2021) హాజరవుతున్నట్లు యువతి చెప్పింది. దీనిని అదనుగా భావించిన ఆ యువకుడు.. తానూ వస్తున్నానని తెలిపాడు. మంగళవారం ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయలుదేరి ఆమె వద్దకు చేరుకున్నాడు. ఆమె వద్దని వారించినప్పటికీ ఇంటి వద్ద దింపుతానని.. తాను వచ్చేవరకు వేచిచూడాలని తనను బలవంతం చేశాడు.