ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి - ఉత్తర్‌ప్రదేశ్ వైరల్ వీడియోలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
08:15 June 28
విషాదం..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరాదాబాద్-లక్నో హైవేపై జీపును ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 24మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పంజాబ్‌కు చెందిన ఓ ప్రైవేట్ డబుల్ డెక్కర్ బస్సు నియంత్రణ కోల్పోయి జీపును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ బస్సు పిలిభిత్‌కు వెళ్లాల్సి ఉంది.
Last Updated : Jun 28, 2021, 8:44 AM IST