తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లికి ఒప్పుకోలేదని కూతురిపై కక్ష- కర్రతో చితకబాది.. - daugter to death in up news

తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని.. కన్న కూతురిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా కొట్టి హత్య చేశాడు. మరోవైపు.. కట్టుకున్న భార్యను గొంతుకోసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ రెండు ఘటనలు ఉత్తర్​ప్రదేశ్​లో(​Up Crime News) జరిగాయి. హరియాణాలో జరిగిన మరో ఘటనలో ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువతిని పిస్తోలుతో కాల్చి చంపాడు ఓ కిరాతకుడు.

up crime news
యూపీ నేర వార్తలు

By

Published : Sep 20, 2021, 5:27 PM IST

తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని కన్న కూతురిపై ఓ వ్యక్తి కక్ష గట్టాడు. ఆమెను చితకబాది తన చావుకు కారణమయ్యాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్(Up Crime News)​ బాందా జిల్లాలో(Uttar Pradesh Banda News) జరిగింది.

అసలేం జరిగింది?

బాందా జిల్లాలోని(Uttar Pradesh Banda News) సిమౌనీ గ్రామానికి చెందిన మహబూబ్​ ఖాన్.. తన కుమార్తెను కర్రలతో చితకబాది హత్య చేశాడని బబేరు సర్కిల్ అధికారి(సీఓ) సియారామ్​ తెలిపారు. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఈ ఘటన జరిగిందని చెప్పారు.

సమీపంలోని పొలాల్లో పని చేసే రైతులు.. దీనిపై సమాచారం అందించగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారని సీఓ తెలిపారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అయితే.. అక్కడ ఆమె చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధరించారని పేర్కొన్నారు.

"మహబూబ్​ ఖాన్​ తన కుమార్తెకు ఓ వ్యక్తితో పెళ్లి జరిపించాలని ప్రయత్నించాడు. కానీ, ఆ పెళ్లికి ఆమె ఒప్పుకోలేదు. నాలుగేళ్ల క్రితం ఆ మహిళ ఇంటి నుంచి పరారయింది. అయితే.. ఆ తర్వాత ఆమెను తన తండ్రికి అప్పగించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది."

-పోలీసులు.

నిందితుడు మహబూబ్ ఖాన్​ను సోమవారం అరెస్టు చేశామని బబేరు ఎస్​హెచ్​ఓ ఎన్​కే నాగర్ తెలిపారు. ఇది పరువు హత్యేనని(Honor killing) తెలుస్తోందని చెప్పారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని పేర్కొన్నారు.

మృతదేహాన్ని రూంలో పెట్టి తాళం వేసి..

ఉత్తర్​ప్రదేశ్(​Up Crime News) బులంద్​శహర్​​లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ వ్యక్తి. ఆదివారం రాత్రి వాజిద్​పుర్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి(​Up Crime News) చెందిన హషిమ్​ తన భార్య గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని గదిలో వేసి తాళం వేశాడని చెప్పారు. సోమవారం ఉదయం తాము మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

హషీమ్​ తన భార్యను కొన్ని రోజుల క్రితం.. కొట్టాడని మృతురాలి సోదరి జీనత్ ఖాన్ తెలిపారు. ఈ దృశ్యాలను తన ఫోన్​లో రికార్డు చేసినట్లు చెప్పారు. జీనత్ ఖాన్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు మొదలు పెట్టారు.

పిస్తోలుతో కాల్చి..

హరియాణా పానీపత్​లో(Haryana panipat news) దారుణం జరిగింది. ఓ యువతి ఇంట్లోకి చొరబడిన ఓ వ్యక్తి పిస్తోలుతో ఆమెను కాల్చాడు. దీంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అయితే... ఈ కేసులో రెండు వాదనలు వినిపిస్తున్నాయి.

"విజయ్​, ముస్కాన్​ దంపతులు. వారిద్దరి మధ్య చాలా రోజుల నుంచి గొడవలు తలెత్తగా.. ముస్కాన్​ తన పుట్టింటికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో తనతో పాటు రావాలని విజయ్​ అడగ్గా ఆమె తిరస్కరించింది. దీంతో అగ్రహానికి గురైన విజయ్​.. ముస్కాన్​ను తుపాకీతో కాల్చి చంపాడు. అని డీఎస్​పీ ప్రదీప్ తెలిపారు. హత్య అనంతంరం.. నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడని చెప్పారు. విజయ్​, ముస్కాన్​ది ఇద్దరివి వేరువేరు మతాలు అని చెప్పారు. నాలుగు నెలల క్రితం వారిద్దరూ రిజిస్టర్ వివాహం చేసుకున్నారని చెప్పారు.

అయితే.. బాధితురాలి బంధువులు మాత్రం మరోలా చెబుతున్నారు. విజయ్​ మాత్రమే ముస్కాన్​ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడన్నారు. విజయ్​ను ముస్కాన్​ ప్రేమించలేదని చెప్పారు. ముస్కాన్​ ఇంట్లో ఉండగా వచ్చి పెళ్లి చేసుకోవాలని అడిగాడని, అయితే.. అందుకు ఆమె నిరాకరించిందని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు... ముస్కాన్​ను పిస్తోలుతో కాల్చి చంపాడని ఆరోపించారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఇదీ చూడండి:లేడీ కిలాడీల పక్కా ప్లాన్​- క్షణాల్లో 3 కిలోల బంగారం చోరీ

ABOUT THE AUTHOR

...view details