ఓ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి తొమ్మిదేళ్లుగా ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు ఓ వ్యక్తి. తీరా పెళ్లి విషయం ప్రస్తావించే సరికి మతం మార్చుకోమని బలవంతం చేశాడు. బాధితురాలికి తెలియకుండా ఆమె ఆధార్ కార్డులో పేరు కూడా మార్చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ జిల్లా రుద్రపుర్‌లో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం..
తొమ్మిదేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన బాధితురాలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని రుద్రపుర్కు వలసవచ్చింది. అదే సమయంలో ఆమెకు నిందితుడు సల్మాన్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో సల్మాన్ ఆమెతో ఇన్నాళ్లూ శారీరక సంబంధం కొనసాగించాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి బాధితురాలిని మతం మార్చుకోవాలని నిందితుడు సహా అతని కుటుంబసభ్యులు బలవంతం చేశారు.