తెలంగాణ

telangana

దేశంలో తొలి ముస్లిం ఫైటర్​ పైలట్​గా సానియా మీర్జా

By

Published : Dec 22, 2022, 3:46 PM IST

Updated : Dec 22, 2022, 5:18 PM IST

ఫైటర్​ పైలట్​ అవనీ చతుర్వేది అడుగుజాడల్లో నడవాలనుకుంది ఆ యువతి. ఎంతో క్లిష్టమైన ఎన్డీఏ పరీక్షను రాసీ ఉత్తీర్ణురాలైన సానియా మీర్జా.. గగన విహారమే కాక యుద్ధాలు కూడా చేయగలమని చూపించేందుకు ముందుకు వచ్చింది.

uttarpradesh girl sania mirza
sania mirza

గగన విహారం చేయడమే కాదు యుద్ధాల్లోనూ పోరాడగలమని ఎందరో వనితలు ముందుకొస్తున్నారు. మన దేశ సరిహద్దులు పహారా కాయడం దగ్గర నుంచి యుద్ధ విమానాలు నడిపేంత వరకు అన్నీ చేయగమని అంటున్న ఈ శివంగులు ఎంతో కఠినమైన శిక్షణను సైతం ఎదుర్కొని విజయాన్ని ముద్దాడుతున్నారు. వీరందరినీ ఆదర్శంగా తీసుకున్న ఓ యువ కెరటం ఇప్పుడు ఫైటర్​ పైలట్​గా మారుతోంది. తనే ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన సానియా మీర్జా. అసలు తను ఎందుకు ఫైటర్​ పైలట్​ అవ్వాలనుకున్నదంటే..

సానియాది ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ కుగ్రామం. నాన్న టీవీ మెకానిక్‌. చిన్నప్పటి నుంచి అదే గ్రామంలో చదువుకున్న చిన్నారి సానియాకు ఫైటర్​ పైలట్​ కావాలని కల. అప్పటికే మన దేశంలో ఎంతో మంది వనితలు యుద్ధ విమానాలతో ఆకాశంలో అవలీలగా విన్యాసాలు చేస్తున్నారు. వీటన్నింటినీ చూసిన సానియా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లాలోని ఓ డిఫెన్స్ అకాడమీలో చేరింది.

సానియా మీర్జా

అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత ఎన్డీఏ పరీక్షలకు హాజరైన సానియా 149వ ర్యాంక్​తో ఉత్తీర్ణత సాధించింది. అలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్‌ కానున్న సానియా మీర్జా.. దేశంలోనే తొలి ముస్లిం ఫైటర్ పైలట్​గా చరిత్రకెక్కనుంది​. అంతే కాకుండా ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన తొలి మహిళా పైలట్​ కూడా ఆమే కానుండడం విశేషం. 27న పుణెలో అకాడమీలో చేరనున్న సానియాను చూసి తల్లిదండ్రులు ఎంతో గర్విస్తున్నారు.

సానియా మీర్జా
Last Updated : Dec 22, 2022, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details