ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. 16 ఏళ్ల యువతిని మేనమామలే అమానుషంగా హతమార్చిన(up murder news today) ఘటన సంచలనం సృష్టించింది. ఓ వ్యక్తిని ప్రేమించిందన్న(up honour killings news) కారణంతో ఆమె గొంతుకోసి హత్య చేశారు. బారాబంకి(barabanki murder news) జిల్లా.. అసంద్ర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.
ఇదీ జరిగింది..
ఇంటి బయట ఉన్న గుడిసెలో నిద్రించేందుకు వెళ్లిన యువతి మరుసటి రోజు ఉదయం చాలా సేపటి వరకు బయటకు రాలేదు. దీనితో ఆమెను నిద్రలేపేందుకు తన సోదరి వెళ్లింది. అక్కడ ఆ యువతి నిర్జీవంగా పడింది. అక్కడి దృశ్యాలు చూసి గందరగోళానికి గురైంది. మృతురాలి(uttar pradesh honour killing) సోదరుడి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ నివేదిక ప్రకారం ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లు తేలిందని ఏఎస్పీ మనోజ్ కుమార్ పాండే వివరించారు.
మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మేనమామ(girl murdered by uncle) రామ్కిషోర్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో మేనమామ లాల్ బహదూర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. యువతిని ప్రేమించిన సిరాజ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.