తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరుగుజ్జు వెదురుతో సామాన్యుడి లాభాల పంట - మరుగుజ్జు వెదురుతో సామాన్యుడి లాభాల పంట!

కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, తిరిగి సొంతూళ్ల బాట పట్టిన యువతకు 'రింగాల్' చెట్లే ఉపాధి మార్గంగా మారాయి. సముద్ర మట్టానికి 6-7వేల అడుగుల ఎత్తులో పెరిగే ఈ చెట్లు.. సామాన్యులకు లాభాల పంట పండిస్తున్నాయి. జగత్ జంగ్లీ అనే ఓ పర్యావరణవేత్త.. ఈ చెట్లను విరివిగా పెంచుతూ, ఏకంగా ఓ చిన్నపాటి అడవినే సృష్టించాడు.

uttarakhand villagers making huge profits by growing ringal trees
మరుగుజ్జు వెదురుతో సామాన్యుడి లాభాల పంట!

By

Published : May 17, 2021, 2:34 PM IST

మరుగుజ్జు వెదురుతో సామాన్యుడి లాభాల పంట!

ఎత్తైన పర్వతాల్లో మనకు కనిపించకుండా ఎన్నో అద్భుతాలు దాగి ఉంటాయి. రక్షణ కరవై.. ఎవరూ వినియోగించుకోకుండానే అంతమైపోతున్న అద్భుతాలూ అనేకం. అలాంటిదే రింగాల్ లేదా రింగ్లూ. ఉత్తరాఖండ్‌లో పెరిగే వెదురు జాతికి చెందిన ఓ మొక్క పేరే రింగాల్. స్థానికంగా వీటిని మరుగుజ్జు వెదురు చెట్లని కూడా పిలుస్తారు. ఆ మరుగుజ్జు చెట్లే ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, తిరిగి సొంతూళ్ల బాట పట్టిన యువతకు కూడా రింగాల్ చెట్లే ఉపాధి మార్గంగా మారాయి.

రుద్రప్రయాగ్‌లోని కోట్‌మల్లా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి... రింగాల్ చెట్లతో అడవినే పెంచుతూ వాటి లాభాలను సామాన్యుడికి చేరువ చేస్తున్నాడు. ఆయనే జగత్‌సింగ్.

"మా వద్ద ఉండే కళాకారులు అందరూ యుగాల నుంచీ రింగాల్ ఆధారిత పనుల ద్వారానే ఉపాధి పొందుతున్నారు. చాలా దూరప్రాంతాలకు వెళ్తారు. హిమాలయాల్లోని ఎత్తైన ప్రదేశాలకు కూడా వెళ్లి, రింగాల్‌ కొమ్మలను తెచ్చుకుంటారు."

-జగత్ జంగ్లీ, పర్యావరణవేత్త

సముద్రమట్టానికి 6 నుంచి 7వేల అడుగుల ఎత్తైన ప్రదేశాల్లో రింగాల్ చెట్లు పెరుగుతాయి. మనకు కనిపించే వెదురు చెట్లంత ఎత్తు, వెడల్పుతో ఈ రింగాల్ చెట్లు పెరగకపోయినా... 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ చెట్లు పెరగాలంటే నీరు, గాలిలో తేమ అవసరం. ఇవి ఉన్నచోట అడవుల్లో కార్చిచ్చులు చెలరేగే ప్రమాదమే ఉండదు. పర్యావరణ సమతుల్యతతో పాటు కొండచరియలు విరిగిపడకుండా రింగాల్ చెట్లు కాపాడతాయి.

"నేనిక్కడ రింగాల్‌ ఉత్పత్తి చేస్తున్నాను. వాటితో కళాకారులు వివిధ ఉత్పత్తులు తయారు చేసుకుంటూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు."

-జగత్ సింగ్ జంగ్లీ, పర్యావరణవేత్త

ఇక్కడి అడవుల్లో 300 రకాల రింగాల్‌ చెట్లున్నాయి. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వ్యవధిలో పూర్తిగా పెరుగుతాయి. బుట్టలు, గంపలు, పూల వేజులు, టీపాయ్‌లు, చెత్తబుట్టలు, తివాచీలు, ఇతర అలంకరణ వస్తువులు ఈ బొంగుల నుంచి తయారుచేస్తారు.

"రింగాల్ నుంచి వివిధ ఉత్పత్తులు తయారు చేస్తున్న మా హస్తకళాకారులు... వ్యవసాయానికి కావల్సిన అన్ని సాధనాలూ ఈ చెట్ల కొమ్మల నుంచే తయారుచేసుకుంటారు. వాళ్లు వాడే ఏ పరికరమైనా వాళ్లే స్వయంగా తయారుచేసుకుంటూ వస్తున్నారు."

-జగత్‌సింగ్ జంగ్లీ, పర్యావరణవేత్త

జంగ్లీ చెట్లు విరివిగా పెంచుతూ, ఏకంగా ఓ చిన్నపాటి అడవినే సృష్టించాడు. నిరంతరం కష్టపడుతూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

"రింగాల్ నుంచి తయారవుతున్న ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. వాటి తయారీలో నా వంతు సాయం అందిస్తున్నా."

-జగత్‌సింగ్ జంగ్లీ, పర్యావరణ ప్రేమికుడు

లాక్‌డౌన్ కారణంగా జిల్లాకు చెందిన యువత అంతా తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు. రాణీగఢ్‌కు చెందిన యువతీయువకులకు రింగాల్ ఓ మంచి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. భవిష్యత్తులో రింగాల్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా మారనుంది.

"రింగాల్‌తో తయారుచేసిన బుట్టల్లో, పళ్లు, కూరగాయలు నిల్వచేస్తే, కొన్ని రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ప్రజలు వీటి వాడకం వైపునకు మొగ్గు చూపుతారని అనుకుంటున్నాం. ఈ ఉత్పత్తుల తయారీని సైతం పెద్ద మొత్తంలో చేసేలా కళాకారులను నేను ప్రోత్సహిస్తూనే ఉన్నా."

-జగత్‌సింగ్ జంగ్లీ, పర్యావరణ ప్రేమికుడు

రింగాల్ చెట్లు పెరిగే అడవి... పర్యటకులను సైతం ఆకట్టుకుంటోంది. దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులు ఈ అడవిని మెచ్చుకోకుండా వెనుదిరగరు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ సంప్రదాయ కళకు..సరైన ప్రోత్సాహం అందిస్తే అంతరించిపోకుండా కాపాడుకోవచ్చు. అంతేకాదు ఈ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే, ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది.

ఇదీ చదవండి:చెత్త రిక్షాలో కొవిడ్‌ రోగి మృతదేహం తరలింపు

ABOUT THE AUTHOR

...view details