నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళనలు చేస్తున్న తరుణంలో.. ఉత్తరాఖండ్‌లో ఓ గ్రామ ప్రజలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలోకి భాజపా నాయకుల ప్రవేశాన్ని నిషేధించారు.
రూర్కీ జిల్లాలోని నర్సన్ కలాన్ గ్రామ వాసులు.. ఆ ఊరి ప్రధాన ద్వారం వద్ద 'మా ఊరిలో భాజపా నాయకులకు ప్రవేశం నిషేధం. దీన్ని అతిక్రమించి గ్రామంలోకి అడుగుపెడితే.. రిస్క్‌లో పడతారు' అని ఓ బ్యానర్‌ను ఉంచారు.