తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరెంట్ షాక్​తో 15 మంది మృతి.. నది ఒడ్డున ఘోర ప్రమాదం..

uttarakhand-transformer-explosion-
uttarakhand-transformer-explosion-

By

Published : Jul 19, 2023, 1:00 PM IST

Updated : Jul 19, 2023, 5:12 PM IST

12:57 July 19

Uttarakhand current shock deaths : కరెంట్ షాక్​తో 15 మంది మృతి.. నది ఒడ్డున ఘోర ప్రమాదం

Uttarakhand Transformer accident : ఉత్తరాఖండ్​లో కరెంట్ షాక్ తగిలి 15 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు పోలీస్ ఇన్​స్పెక్టర్లు, ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నారు. చమోలీ జిల్లాలో అలకనందా నది ఒడ్డున.. నమామి గంగే ప్రాజెక్ట్ సైట్ దగ్గర బుధవారం ఈ ఘటన జరిగింది. ఓ పంపింగ్ స్టేషన్ దగ్గర్లోని విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ పేలిపోవడం వల్ల ఇనుప రెయిలింగ్​కుకరెంట్ సరఫరా జరిగినట్లు తెలిసింది. అక్కడే ఉన్న వారిలో కొందరు ఘటనాస్థలిలోనే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

"మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో బుధవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. పంచనామా నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ట్రాన్స్​ఫార్మర్​ పేలి రెయిలింగ్​కు విద్యుత్​ సరఫరా కావడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా తెలిసింది. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయి." అని ఉత్తరాఖండ్ అదనపు డీజీపీ వి.మురుగేశన్ తెలిపారు.

విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం
Uttarakhand Electrocution News : ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెజిస్టేరియల్​ విచారణకు ఆదేశించారు. "ఇది చాలా బాధకరమైన ఘటన. జిల్లా యంత్రాంగం, పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్​ ద్వారా రిషికేశ్ ఎయిమ్స్​ తరలిస్తున్నారు. మెజిస్టీరియల్ విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చాం" అని చెప్పారు.

ప్రధాని మోదీ తీవ్ర సంతాపం
ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కరెంట్ షాక్​తో మరో ఇద్దరు మృతి
రాజస్థాన్​లో ఓ బస్టాండ్​లో కరెంట్ షాక్తగిలి ఇద్దరు మరణించారు. భిల్వాఢా బస్టాండ్​లోని జ్యూస్​ మెషీన్​ నుంచి కరెంట్ షాక్ తగలడం వల్ల మరణించారని సీఐ యోగేశ్ శర్మ తెలిపారు. వీరిని బాబులాల్​ మీనా(40), నౌశద్​(34) గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని చెప్పారు.

ఇవీ చదవండి :కావడి యాత్రలో విషాదం.. కరెంట్​ షాక్​కు గురై ఐదుగురు భక్తులు మృతి.. మరో 16 మంది..

రోడ్డు దాటుతూ కరెంట్​ స్తంభాన్ని తాకి మహిళ మృతి.. విహార యాత్రకు వెళ్తుండగా ప్రమాదం..

Last Updated : Jul 19, 2023, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details