కరోనా సోకి ఉత్తరాఖండ్ భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా మృతి చెందారు. కొవిడ్-19 కారణంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతోనే ఉన్న ఆయన.. దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు.
కరోనాతో భాజపా ఎమ్మెల్యే మృతి - కరోనాతో భాజపా ఎమ్మెల్యే మృతి
కరోనా మహమ్మారి చిన్నాపెద్ద, ధనిక పేద అని తేడా లేకుండా బలి తీసుకుంటోంది. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే సురేంద్రసింగ్ కొవిడ్-19 బారిన పడి మృతిచెందారు.
కరోనాతో భాజపా ఎమ్మెల్యే మృతి
అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భార్య కొన్ని రోజుల క్రితమే గుండెపోటుతో చనిపోయారు.