తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిసార్ట్ కూల్చివేత, పోస్ట్​మార్టం రిపోర్ట్​పై డౌట్స్​.. రిసెప్షనిస్ట్ కేసులో మరో ట్విస్ట్! - రిసార్ట్ రిసెప్షనిస్ట్ హత్య కేసు

Uttarakhand Resort Receptionist : ఉత్తరాఖండ్​ యువతి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతి నీట మునిగి చనిపోయినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక పేర్కొంది. చనిపోవడానికి ముందు ఎవరో తీవ్రంగా కొట్టినట్లు ఆధారాలు ఉన్నాయని దానిలో పేర్కొన్నారు.

uttarakhand resort receptionist
uttarakhand resort receptionist

By

Published : Sep 25, 2022, 5:12 PM IST

Uttarakhand Resort Receptionist : ఉత్తరాఖండ్‌లో కొద్దిరోజులుగా కనిపించకుండా పోయి, శవమై తేలిన యువతి హత్యకేసు దర్యాప్తు మలుపులు తిరుగుతోంది. ఆ యువతి నీట మునిగి చనిపోయినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక పేర్కొంది. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఈ నివేదికను విడుదల చేసింది. చనిపోవడానికి ముందు ఎవరో తీవ్రంగా కొట్టినట్లు ఆధారాలు ఉన్నాయని దానిలో పేర్కొన్నారు. మరోవైపు పోస్టుమార్టం తుది నివేదిక వచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించమని బాధితురాలి తండ్రి తేల్చిచెప్పారు.

సదరు యువతి కనిపించకుండా పోయిన ఆరు రోజుల తర్వాత శనివారం రిషికేశ్‌ వద్ద చీలా కాల్వలో ఆమె మృతదేహం బయటపడింది. ఆమె మృతదేహానికి ఎయిమ్స్‌లోని నలుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఆమె గాయాలకు సంబంధించిన వివరాలు తుది నివేదికలో ఉండొచ్చని భావిస్తున్నారు.

రిసార్టు కూల్చివేతపై సందేహాలు..:
యువతి పనిచేసే రిసార్టు భవనం అక్రమ నిర్మాణమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దానిని కూల్చివేసింది. ఈ చర్యను మృతురాలి కుటుంబీకులు తప్పుపట్టారు. ఆధారాలను నాశనం చేసేందుకే ఈ చర్యను చేపట్టారని పేర్కొన్నారు.

యువతి మిత్రుడిని తప్పుదోవ పట్టించేందుకు యత్నం:మరోవైపు నిందితుడు పుల్కిత్‌ ఆర్య సదరు యువతి మిత్రుడైన పుష్ప్‌ను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు పుల్కిత్‌ కాల్‌ రికార్డింగ్‌లు వెలుగు చూశాయి. వీటిల్లో ఒక సారి పుష్ప్‌తో మాట్లాడుతూ "మేము అంకితతో కలిసి రిషికేశ్‌కు వెళ్లి రాత్రి తొమ్మిదింటికి రిసార్ట్‌కు వచ్చాము. అంకిత మాతో కలిసి డిన్నర్‌ కూడా చేసింది. కానీ, మర్నాడు ఉదయం నుంచి ఆమె గది నుంచి అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నాం" అని పేర్కొన్నాడు.

మరో కాల్‌లో పుల్కిత్‌ ఏకంగా పుష్ప్‌పైనే అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. ఆ కాల్‌లో పుల్కిత్‌ మాట్లాడుతూ "అంకిత నీ వద్ద ఉందా..? ఆమె ఎప్పుడూ నీ గురించి మాట్లాడుతుంటుంది" అని అడిగాడు. దీనికి పుష్ప్‌ సమాధానం చెబుతూ "నేను చాలా దూరంలో ఉన్నాను. మీ వద్ద ఉన్న ఆమె ఇంత దూరం ఎలా వస్తుంది. ముందు మీరు ఆమె కోసం వెతకండి.. లేకపోతే సమస్యల్లో చిక్కుకొంటారు" అని హెచ్చరించాడు. వాస్తవానికి హత్య జరిగిన రోజు పుష్ప్‌కు రాత్రి 8.30 కాల్‌ చేస్తానని అంకిత పేర్కొంది. కానీ, ఫోన్‌ రానందున అతడే పుల్కిత్‌, అంకిత, భాస్కర్‌కు ఫోన్లు చేశాడు.

నా కుమారుడు నిర్దోషి..!:అంకిత హత్యలో ప్రధాన నిందితుడైన పుల్కిత్‌ ఆర్యపై వస్తున్న ఆరోపణలను తండ్రి వినోద్‌ ఆర్య తోసిపుచ్చాడు. తన కుమారుడు సాధారణ యువకుడని పేర్కొన్నాడు. అతడికి ఎప్పుడూ వ్యాపారంపైనే ధ్యాస అని వివరించాడు. పుల్కిత్‌, అంకిత ఇద్దరికీ న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు వివరించాడు. అతను తమ నుంచి వేరుగా జీవిస్తున్నాడని పేర్కొన్నారు.

యువతి హత్యకేసులో రిసార్టు యజమాని పుల్కిత్‌ ఆర్య, అతడి సిబ్బంది అరెస్టయ్యారు. సదరు యువతి రిసార్టుకు వచ్చే అతిథులకు 'ప్రత్యేక' సేవలు అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు పులకిత్‌ తండ్రి.. హరిద్వార్‌లో భాజపా కీలక నేత అయిన వినోద్‌ ఆర్యను, ఆయన మరో కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి హామీ ఇచ్చారు. ఈ కేసులో శుక్రవారం పులకిత్‌తో పాటు.. రిసార్టులో పనిచేస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:14 గంటల్లో 35 కి.మీ దూరం ఈత..14 ఏళ్ల బాలుడి అరుదైన రికార్డు

మూగజీవాల కోసం మూడు అంతస్తుల భవనం.. జంతువుల నేస్తం ఈ నిధి

ABOUT THE AUTHOR

...view details