ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారని భాజపా సీనియర్ నేత, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
'ఆదివారమే ఉత్తరాఖండ్ కొత్త సీఎం ప్రమాణం'
18:06 July 03
16:36 July 03
ఉత్తరాఖండ్ భాజపా శాసనసభాపక్షనేతగా ఎన్నికైన అనంతరం గవర్నర్‌ను కలిసేందుకు రాజభవన్ వెళ్లారు పుష్కర్ సింగ్ ధామీ. నూతన సీఎంగా ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నాారు.
15:41 July 03
ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ నియమితులయ్యారు. దెహ్రాదూన్‌లో జరిగిన భాజపా శాసనసభపక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు.
14:56 July 03
- ఉత్తరాఖండ్: కాసేపట్లో భాజపా శాసనసభాపక్ష సమావేశం
- ఉత్తరాఖండ్ భాజపా అధ్యక్షుడు మదన్ కౌశిక్ నేతృత్వంలో సమావేశం
- ఉత్తరాఖండ్: శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్న భాజపా ఎమ్మెల్యేలు
- కేంద్ర పరిశీలకుడిగా హాజరుకానున్న కేంద్రమంత్రి తోమర్
- శాసనసభాపక్ష భేటీకి ముందు ఎమ్మెల్యేలతో కేంద్రమంత్రి తోమర్ చర్చలు
- ఉత్తరాఖండ్: నిన్న సీఎం పదవికి రాజీనామా చేసిన తీరథ్ సింగ్ రావత్
09:30 July 03
'ఆదివారమే ఉత్తరాఖండ్ కొత్త సీఎం ప్రమాణం'
ఉత్తరాఖండ్ భాజపా శాసనసభాపక్ష భేటీ జరగనున్న నేపథ్యంలో కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దెహ్రాదూన్ చేరుకున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమౌతుందని తోమర్ తెలిపారు. దాని కంటే ముందుగా పార్టీలోని అందరూ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చిస్తానని చెప్పారు.
నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు శాసనసభాపక్షనేత ఎన్నిక కార్యక్రమంలో పాల్గొంటామని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మదన్ కౌశిక్ తెలిపారు. ఎన్నిక అనంతరం శాసన సభ్యులతో కలిసి గవర్నర్‌ను కలుస్తామని పేర్కొన్నారు.
తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయకపోతే అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసేదని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు.
తీరథ్ సింగ్ రావత్ ఇప్పటికే రాజీమానా లేఖను ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు సమర్పించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే తీరథ్ సింగ్ రాజీనామా చేయటం గమనార్హం.