తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Joshimath: ఉత్తరాఖండ్​లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్​లో(Joshimath) శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేలుపై 4.6గా నమోదైంది. ఈ ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

భూకంపం
భూకంపం

By

Published : Sep 11, 2021, 10:25 AM IST

ఉత్తరాఖండ్‌ జోషీమఠ్​లో(Joshimath) భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదైంది. ఆదివారం ఉదయం 5.58 గంటలకు జోషీమఠ్‌కు 31 కిలోమీటర్ల దూరంలో.. భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) తెలిపింది.

ఐదు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు ఆ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరగలేదని తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details