తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Chardham yatra news: చార్​ధామ్​ యాత్రకు ఇవి తప్పనిసరి.. - chardham yatra e pass

పవిత్ర చార్​ధామ్ (Chardham yatra news​) పుణ్యక్షేత్రాలు సందర్శించాలనుకునే భక్తుల కోసం.. ఉత్తరాఖండ్​ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

Chardham yatra news
చార్​ధామ్​ యాత్రకు ఇవి తప్పనిసరి..

By

Published : Oct 6, 2021, 4:53 PM IST

Updated : Oct 6, 2021, 10:25 PM IST

చార్‌ధామ్‌ యాత్రపై (Chardham yatra news) పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. యాత్రికుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని.. కానీ దర్శనాల కోసం తప్పనిసరిగా చార్‌ధామ్‌ బోర్డు పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఇకపై పోర్టల్ నుంచి యాత్ర ఇ-పాస్ (Chardham yatra e pass)​ అవసరం లేదని వెల్లడించింది. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని, ఇది సాధ్యంకాని పక్షంలో మరింత మందిని అనుమతించాలని కోరుతూ కొద్దిరోజుల క్రితమే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు మంగళవారం స్పందిస్తూ రోజువారీ యాత్రికులపై పరిమితులను ఎత్తివేసింది.

ఇప్పటివరకు బద్రీనాథ్‌కు రోజుకు 1000 మంది భక్తులు, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంది. కాగా ఈ ఆంక్షలు సడలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవరణ దరఖాస్తు దాఖలు చేసింది. ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన ఈ యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, ప్రస్తుతం భక్తుల సంఖ్యపై పరిమితి కారణంగా యాత్రికులపై ఆధారపడి ఉన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.

వీటితో పాటు దర్శనానికి వచ్చే భక్తులు.. టీకా రెండు డోసులు తీసుకొని ఉండాలి. లేదా.. కరోనా నెగెటివ్​ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొవిడ్​ టెస్టు చేయించుకున్న 3 రోజుల వరకు మాత్రమే ఈ ధ్రువపత్రం యాత్ర (Chardham yatra news) సమయంలో చెల్లుబాటు అవుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా లేకుంటే నాలుగు ధామాల్లో దర్శనానికి అనుమతి లేదని ప్రభుత్వం వెల్లడించింది.

'చార్​ధామ్'​ (Chardham yatra 2021) అంటే ఉత్తరాఖండ్​లోని నాలుగు పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్​నాథ్​, బద్రీనాథ్​ దేవాలయాలు.

ఇవీ చూడండి:Chardham Yatra 2021: చార్​ధామ్​ యాత్ర షురూ..

Last Updated : Oct 6, 2021, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details