ఉత్తరాఖండ్ జలవిలయంలో మరో రెండు మృత దేహాలు బయటపడ్డాయి. ఛమోలీ జిల్లాలోని తపోవన్ సొరంగం శిథిలాల్లో మృత దేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 67కు చేరింది. మరో 137 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.
జల విలయం: 67కు చేరిన మృతుల సంఖ్య - ఉత్తరాఖండ్ ప్రమాదం
ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలో సంభవించిన జల ప్రళయంలో.. మరో రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 67కు చేరింది.
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సంభవించిన జల ప్రళయం
జల ప్రళయం ఘటన జరిగి 13 రోజులు దాటినా.. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యారేజ్ నుంచి ధౌలిగంగా నదీ జలాలు సొరంగంలోకి వస్తున్నందున సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అయితే..అత్యాధునిక యంత్రాల సాయంతో జలాలను దారి మళ్లించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.