ఉత్తరాఖండ్లో వరద సహాయక చర్యలు ఆరో రోజూ కొనసాగుతున్నాయి. గురువారం రిషిగంగా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి, తపోవన్ సొరంగం వద్ద నిలిచిన సహాయక చర్యలు ఈ ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి.
చమోలీ జిల్లాలో ఆకస్మిక వరదల వల్ల ఇప్పటివరకు 36 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇద్దరు సజీవంగా బయటపడగా.. 204 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు.
రిషిగంగా నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్టు చమోలీ పోలీసులు తెలిపారు. భయపడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.