తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూగజీవాలు రోడ్డు దాటేందుకు వంతెన - kaldungi forest range officer

వాహనాల కిందపడి ఎన్నో చిన్నచిన్న జంతువులు తరచూ ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి వాటిని కాపాడటానికి ఉత్తరాఖండ్​ అటవీశాఖ అధికారులు ఓ సరికొత్త ప్రయత్నం చేశారు. వాటికోసం ప్రత్యేకంగా ఓ వంతెనను నిర్మించారు. ఎలాంటి సిమెంట్​, ఇనుము వాడకుండా వెదురు, తాళ్లు, గడ్డి వంటి వాటిని ఉపయోగించి ఎకో ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించారు.

uttarakhand gets its first eco bridge for small animals
మూగజీవాలకు రక్షణగా ఓ వంతెన

By

Published : Dec 3, 2020, 5:28 AM IST

మూగజీవాల రక్షణ కోసం ఉత్తరాఖండ్​ అధికారులు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. చిన్నచిన్న జంతువులు, సరీసృపాలు రోడ్డు దాటేటప్పుుడు వాహనాల కింద పడకుండా కాపాడేందుకు ఓ వంతెనను నిర్మించారు. కలదుంగి-నైనిటాల్​ రహదారిపై రామ్​నగర్​ అటవీశాఖ అధికారులు దీన్ని ఏర్పాటు చేశారు.

మూగజీవాల కోసం నిర్మించిన వంతెన
మూగజీవాల కోసం నిర్మించిన వంతెన

90 అడుగుల ఎత్తులో, 5 అడుగుల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించినట్లు కలదుంగి రేంజ్​ అటవీ అధికారి అమిత్​ కుమార్​ గోస్వామి తెలిపారు. పర్యావరణ హితంగా ఈ నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు.

" పాములు, ఉడుతలు, చిన్న చిన్న జంతువులు రోడ్డును దాటేటప్పుడు వాహనాల కింద పడి చనిపోకుండా ఉండేందుకు ఈ వంతెనను నిర్మించాం. ఇందుకోసం ఎలాంటి సిమెంట్​, ఇనుము వాడలేదు. వెదురు, తాళ్లు, గడ్డి వంటి వాటిని ఉపయోగించి ఎకో ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించాం."

-- అమిత్​ కుమార్​ గోస్వామి, కలదుంగి రేంజ్​ అటవీ అధికారి.

మూగజీవాల కోసం నిర్మించిన వంతెన

ఉత్తరాఖండ్​ రాష్ట్రంలోనే ఈ తరహా వారధిని నిర్మించడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి:మనిషిని తొక్కిన గజరాజు- వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details