తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్​ రాజీనామా - ఉత్తరాఖండ్​ సీఎం

Yogi Adityanath: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో యూపీ, పంజాబ్​, ఉత్తరాఖండ్​, మణిపుర్​ సీఎంలు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ నాలుగు రాష్ట్రాల కేబినెట్‌లు.. తమ శాసనసభలను రద్దు చేయాలని గవర్నర్లకు సిఫార్సు చేశాయి.

Yogi Adityanath
యోగి ఆదిత్యనాథ్

By

Published : Mar 12, 2022, 7:41 AM IST

Yogi Adityanath: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో.. నూతన ప్రభుత్వాల ఏర్పాటుకు వీలుగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ, మణిపుర్‌ సీఎం బీరేన్‌సింగ్‌ తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేశారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యేంతవరకు వీరంతా ఆపద్ధర్మ సీఎంలుగా కొనసాగనున్నారు.

ఈ నాలుగు రాష్ట్రాల కేబినెట్‌లు.. తమ శాసనసభలను రద్దు చేయాలని గవర్నర్లకు సిఫార్సు చేశాయి. మరోవైపు- గోవాలో సీఎం ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలో శుక్రవారం భేటీ అయిన కేబినెట్‌ కూడా.. శాసనసభను రద్దు చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫార్సు చేయాలని తీర్మానించింది. తాజా ఎన్నికల్లో అద్భుత విజయాలతో యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవాల్లో భాజపా అధికారాన్ని నిలబెట్టుకోగా.. పంజాబ్‌లో ఆప్‌ అపూర్వ విజయం సాధించింది.

ఇదీ చూడండి:రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సర్పంచ్​పై కాల్పులు

ABOUT THE AUTHOR

...view details