కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పూర్తిగా కోలుకున్నారు. డిసెంబర్ 28నుంచి ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంకా కొన్ని రోజుల పాటు దిల్లీలోని నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటారని పేర్కొన్నారు.
కరోనాను జయించిన సీఎం- ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ - ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా నుంచి కోలుకున్నారు. కొద్ది రోజులుగా దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొన్ని రోజులు దేశరాజధానిలోనే స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు.
కరోనాను జయించిన సీఎం- ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్
త్రివేంద్ర సింగ్ రావత్‌కు డిసెంబర్ 18న కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆరోగ్యం క్షీణించి డిసెంబర్ 27న దేహ్రాదూన్‌లోని ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ఫెక్షన్ గుర్తించి మెరుగైన చికిత్స కోసం ఆ మరునాడే దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.