తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొన్న జీన్స్‌.. ఇవాళ అమెరికా.. మళ్లీ వార్తల్లోకి సీఎం

ఉత్తరాఖండ్​ సీఎం తీరథ్ సింగ్ రావత్​ మరోసారి వార్తల్లోకెక్కారు. మనదేశాన్ని అమెరికా 200 ఏళ్లు పాలించిందని నోరు జారి సోషల్​ మీడియాకు చిక్కారు. అంతకుముందు చిరిగిన జీన్స్​పై ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

uttarakhand chief minister back again in controversy
మొన్న జీన్స్‌.. ఇవాళ అమెరికా.. మళ్లీ వార్తల్లోకి సీఎం

By

Published : Mar 21, 2021, 11:16 PM IST

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన తీరథ్​‌ సింగ్‌ రావత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇద్దరు పిల్లల తల్లై ఉండీ ఒకావిడ చిరిగిన జీన్స్‌ వేసుకుందని, అలాంటావిడ సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేసి తొలిసారి వార్తలకెక్కారాయన. దీంతో నెట్టింట పెద్దఎత్తున చర్చ నడిచింది. అయితే, ఈ సారి అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందంటూ నోరు జారి మరోసారి సోషల్‌మీడియాకు చిక్కారు. 'జీన్స్‌' అంశాన్నే ఇంకా మరిచిపోని నెటిజన్లు నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ తీరథ్​ ‌సింగ్‌ ఏమన్నారంటే..

కొవిడ్‌ కట్టడిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మిన్నగా వ్యవహరించిందని తీరథ్ సింగ్‌ ఓ సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 'మన దేశాన్ని 200 ఏళ్ల పాటు ఏలిన అమెరికా సైతం ఇవాళ కొవిడ్‌ కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది' అని అన్నారు. మోదీ మాత్రం కొవిడ్‌ కట్టడికి చర్యలు తీసుకున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కొందరు మాత్రమే మాస్కు ధరించడం, శానిటైజర్‌ వాడడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, తన ప్రసంగంలో బ్రిటన్‌కు బదులు అమెరికా అని అనగా నెట్టింట ఆయనపై ఫన్నీ కామెంట్ల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. 'మా చరిత్ర పుస్తకాల్లో ఇదెక్కాడా లేదే' అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ కుమార్‌తో తీరత్‌ను పోలుస్తున్నారు.

ఇదీ చూడండి:'చిరిగిన జీన్స్'​ వ్యాఖ్యలపై సీఎంకు భాజపా సమన్లు

ఇదీ చూడండి:మహిళల వస్త్రధారణ వ్యాఖ్యలపై రావత్ క్షమాపణ.. కానీ!

ABOUT THE AUTHOR

...view details