వివాదాస్పద వ్యాఖ్యలతో ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి ధన్సింగ్ రావత్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో వర్షాలను మొబైల్ యాప్ ద్వారా నియంత్రిస్తామని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా మహిళల కోసం గడ్డి అందించే షాపులను నెలకొల్పుతామని చెప్పారు. ధన్ సింగ్ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
మంత్రి ఏమన్నారంటే..?
శ్రీనగర్‌లోని ఓ గ్రామంలో నిర్వహించిన మహిళల సమావేశానికి ఆయన హాజరయ్యారు. అక్కడ ఆయన ప్రసంగిస్తూ.. గ్రామాల్లో ప్రభుత్వం గడ్డి షాపులు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు, రేషన్‌ను అందిస్తున్న తరహాలోనే ప్రతి మహిళకు 20 కిలోల గడ్డి ప్యాక్‌లను అందిస్తామని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలకు ఆయన ఎదురుగా కూర్చున్న మహిళలు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.