తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జననాంగాలను కొరికి వ్యక్తి హత్య.. షాక్​లో పోలీసులు! - హరిద్వార్

రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహం గురించి అందిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఒక్కసారిగా కంగుతిన్నారు. శవాన్ని పరిశీలించగా.. జననాంగాలకు కొరకడం వల్ల ఆ వ్యక్తి మరణించినట్లు తెలుసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో జరిగింది.

uttarakhand news
murder news

By

Published : May 7, 2022, 3:44 PM IST

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి జననాంగాలను కొరికి అతడు ప్రాణాలు కోల్పోయేలా చేశారు పలువురు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఇదీ జరిగింది..సిద్కుల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శనివారం వేకువజామున రోడ్డు పక్కన ఓ యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. జననాంగాలను కొరకడం వల్ల ఆ వ్యక్తి చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:బీచ్​లో విగతజీవిగా 18 ఏళ్ల యువతి.. అసలేం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details