ఉత్తరాఖండ్ ఆకస్మిక జలప్రళయంలో తీవ్రంగా ప్రభావితమైన జోషీమఠ్, చమోలీ జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రిల్లింగ్ ఆపరేషన్ ద్వారా ఎట్టకేలకు తపోవన్ సొరంగానికి రంధ్రం చేయగలిగారు. దీంతో సుదీర్ఘ సహాయక చర్యల్లో ముందడుగు పడినట్టైంది.
పురోగతి..
బురదతో నిండిపోయిన తపోవన్ సొరంగంలో 30 మందికి పైగా చిక్కుకుని ఉంటారని రెస్క్యూ బృందాలు మొదటినుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. అందులో మనుషులున్నారా లేరా అనే విషయాన్ని కనుగొనేందుకు సొరంగంలోకి కెమెరాను పంపాలని నిర్ణయించారు. దీనికోసం శనివారం మరింత పెద్ద రంధ్రం చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
''75 మీటర్ల వెడల్పు.. 12 మీటర్ల పొడవైన సొరంగానికి విజయవంతంగా రంధ్రం చేయగలిగాం. సొరంగంలో నీరు, బురద లేదని.. లోపల చిక్కుకున్న వారు క్షేమంగా ఉంటారనేందుకు ఇది మంచి సంకేతం.''