ఉత్తరాఖండ్‌లో శనివారం సంభవించిన అకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 11కు చేరింది. చమోలీ జిల్లాలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న 10 మంది మృతదేహాలను శనివారం వెలికి తీసిన అధికారులు...తాజాగా మరో మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం.. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా జోషీమఠ్‌కు తరలించామని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ స్వాతి ఎస్ బదౌరియా తెలిపారు.
ఉత్తరాఖండ్ ప్రమాదంలో 11కు చేరిన మృతులు
ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదల ఘటనలో ఆదివారం మరో మృతదేహం లభ్యమైంది. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. గల్లంతైన మరికొందరి ఆచూకి కోసం.. గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదలు
ఉత్తరాఖండ్‌లో 5 రోజులుగా భారీ వర్షం కురుస్తుండగా.. జోషీమఠ్-మలారీ మధ్య రహదారి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికుల శిబిరాలను వరదలు ముంచెత్తాయి. కార్మికులను రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సహాయక బృందాలు.. 384 మంది కార్మికులను కాపాడాయి. గల్లంతైన మరికొందరి ఆచూకీ కోసం.. గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు స్వాతి బదౌరియా వెల్లడించారు.
ఇదీ చూడండి:ఆక్సిజన్ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు