ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. మంటల ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడు జంతువులు కూడా మృత్యువాత పడ్డాయి. శనివారం ఒక్కరోజే 62 హెక్టార్ల అటవీ భూమిలో ఈ మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్లో కార్చిచ్చు- నలుగురు మృతి - ఉత్తరాఖండ్ కార్చిచ్చుుు
ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటల వల్ల ఇప్పటివరకు రూ.37 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్లో కార్చిచ్చు- నలుగురు మృతి
మంటలను ఆర్పేందుకు 12,000 మంది అటవీ శాఖ సిబ్బంది మోహరించారని ఉత్తరాఖండ్ అటవీ సంరక్షణ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటివరకు రూ.37 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు.
ఇదీ చూడండి:బీజాపుర్ ఎన్కౌంటర్లో 22మంది జవాన్లు మృతి