ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల ధాటికి ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి ఆచూకీ గల్లంతైంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. తల్లితో పాటు తన మూడేళ్ల కూతురు, మరో మహిళ ఈ ఘటనలో మరణించినట్లు వెల్లడించారు.
అధికారుల సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఉత్తరకాశీ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. మందో గ్రామంలో సుమారు 15-20 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఐదు ఇళ్లు నేలకూలాయి.
గ్రామంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్) టీమ్ ఇంఛార్జ్ జగదాంబ ప్రసాద్ తెలిపారు. కంకరాడి అనే గ్రామంలో రెండు ఇళ్లు వరదలకు కొట్టుకుపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
సీఎం విచారం