ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆదివారం మరో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 51కి చేరింది.
ఆదివారం తపోవన్ సొరంగం వద్ద 6 మృతదేహాలు లభ్యం కాగా.. మరో ఆరు మృతదేహాలు రైనీ గ్రామం వద్ద కనిపించాయి. రుద్రప్రయాగ్ నదీ ఒడ్డున ఒక మృతదేహం కనిపించింది.