తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లల మధ్య గొడవ- నాలుకపై కత్తెరతో పొడిచి... - మైనర్ల మధ్య ఘర్షణ

ఇద్దరు మైనర్ల మధ్య తలెత్తిన వివాదం.. హింసాత్మకంగా మారింది. ఓ బాలుడి కుటుంబ సభ్యులు ముగ్గురు కలిసి, మరో బాలుడి నాలుకను కత్తెరతో గుచ్చారు. ఈ ఘటనలో గాయపడ్డ బాధిత బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.

Uttar Pradesh Bulandshahr News
మైనర్ల మధ్య గొడవ

By

Published : Sep 30, 2021, 4:13 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​శహర్​ జిల్లాలో(Uttar Pradesh Bulandshahr News) దారుణం జరిగింది. మైనర్ల మధ్య తలెత్తిన గొడవ రక్తపాతానికి దారి తీసింది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ బాలుడి నాలుకను కత్తెరతో గుచ్చారు.

అసలేమైంది?

బులంద్​శహర్ జిల్లా(Uttar Pradesh Bulandshahr News) బరౌలీ గ్రామంలో.. ఇద్దరు మైనర్ల మధ్య ఏదో విషయంలో గొడవ తలెత్తింది. దాంతో వారిలో ఓ బాలుడి కుటుంబ సభ్యులు ముగ్గురు క్రూరంగా ప్రవర్తించారు. ఇంకో బాలుడి నాలుకను కత్తెరతో గుచ్చారు. ఈ క్రమంలో మరో బాలుడి తలకు కూడా గాయాలయ్యాయి.

బాలుడిపై కత్తెరతో దాడి తర్వాత అతడి గొంతు నుంచి, నోటి నుంచి తీవ్రంగా రక్తస్రావమైనట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అతడ్ని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ఎవరూ లేరని చెప్పారు. అయితే.. అతడే ఏదోలా పోలీస్​ స్టేషన్​కు చేరుకుని, జరిగిన విషయాన్ని తమకు తెలియజేశాడని పోలీసులు వెల్లడించారు.

తీవ్ర రక్తస్రావమైన బాధిత బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అతడు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడని చెప్పారు. దీనిపై ఐపీసీలోని సెక్షన్​ 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:మాస్క్​ లేదని ఫైన్.. అధికారుల్ని చితకబాదిన స్థానికులు

ఇదీ చూడండి:విమానం సీటు కింద దాచి బంగారం స్మగ్లింగ్​.. చివరకు...

ABOUT THE AUTHOR

...view details