ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై (priyanka gandhi up elections) హామీల వర్షం కురిపిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. తాజాగా మరో ప్రకటన చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ మేరకు ప్రియాంక సోమవారం ట్వీట్ చేశారు.
"రాష్ట్రంలో వైద్య వ్యవస్థ అధ్వానంగా ఉంది. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రజలకు తక్కువ ధరకు, నాణ్యమైన వైద్యం అందించే దిశగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. మమ్మల్ని గెలిపిస్తే ఏ రోగానికి సంబంధించిన వైద్యమైనా రూ. 10 లక్షల వరకు ఉచితంగా అందిస్తాం."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి