ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ దేహత్ జిల్లా జైతాపుర్ గ్రామంలో... సగం కాలిపోయిన పన్నెండేళ్ల చిన్నారి శవం బయటపడటం కలకలం రేపింది. బాలికను బుధవారం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి 200 మీటర్ల దూరంలోని ఓ జామ తోటలో శవాన్ని గుర్తించినట్లు చెప్పారు.
తన కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అయిన ముందు రోజు రాత్రి ఇంటి ఆరుబయట బాలిక నిద్రపోయిందని, ఉదయం చూసేసరికి కనిపించలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. చుట్టుపక్కల వెతకగా.. సగం కాలిన శవం అర్ధనగ్నంగా పడి ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఓ మంచం కూడా ఉందని చెప్పారు.