తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​కౌంటర్​ చేయకండి సార్​.. లొంగిపోతా'.. మెడలో బోర్డుతో పోలీస్​ స్టేషన్​కు పరుగులు - ghaziabad crime news in hindi

'నన్ను ఎన్​కౌంటర్​ చేయకండి సార్​.. మళ్లీ జీవితంలో నేరం చేయను' అంటూ మెడలో బోర్డు తగిలించుకుని వచ్చాడు ఓ నిందితుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో జరిగింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీస్​ స్టేషన్​కు వచ్చి లొంగిపోయాడు.

uttar pradesh encounter news
uttar pradesh encounter news

By

Published : Sep 12, 2022, 6:06 PM IST

నేరాలకు పాల్పడితే ఎన్​కౌంటర్​ చేస్తామంటూ.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ చేసిన హెచ్చరికలు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి భయంతో మెడలో ఓ బోర్డు తగిలించుకుని పోలీస్​ స్టేషన్​కు వచ్చాడు. తాను లొంగిపోతానని, జీవితంలో మరోసారి నేరాలకు పాల్పడనని, తనను ఎన్​కౌంటర్​ చేయొద్దని అట్టపైన రాసి మెడలో వేసుకున్నాడు. ఈ ఘటన గాజియాబాద్​లో జరిగింది.

నిందితుడి మెడలోని బోర్డు

లోని బోర్డర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో సెప్టెంబర్​ 9న ఓ హత్య జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అవసరమైతే నిందితుడిని ఎన్​కౌంటర్​ చేస్తామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ. దీంతో హడలిపోయిన నిందితుడు సొహైల్​.. తాను జీవితంలో మరోసారి నేరం చేయనని.. తనను ఎన్​కౌంటర్​ చేయవద్దని మెడలో బోర్డు తగిలించుకుని వచ్చి పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు.
అంతకుముందు ఓ మహిళతో సంబంధం పెట్టుకుని హత్య చేసిన కేసులోనూ సొహైల్​ నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నిందితులను వదిలిపెట్టమని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details