తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యోగి దిగితే ఫ్రాన్స్​లో అల్లర్లు బంద్'.. జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్​.. ఒవైసీ సెటైర్ - పారిస్​లో అల్లర్లు

Yogi Adityanath Can Stop France Riots : ఫ్రాన్స్​లో చేలరేగుతున్న హింసను ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. 24 గంటల్లో అదుపు చేయగలరని జర్మనీకి చెందిన ఓ ప్రొఫెసర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్​పై యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం స్పందించింది. ప్రపంచంలో ఎక్కడైనా అల్లర్లు జరిగినప్పుడు 'యోగి మోడల్'​నే అనుసరిస్తారని ట్వీట్ చేసింది. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందని అన్నారు AIMIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.

france riots 2023
ఫ్రాన్స్​లో అల్లర్లు

By

Published : Jul 1, 2023, 4:13 PM IST

Yogi Adityanath Can Stop France Riots : ఫ్రాన్స్​లో అల్లర్లను అరికట్టేందుకు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను ఆ దేశానికి పంపాలని జర్మనీకి చెందిన ప్రొఫెసర్​, కార్డియాలజిస్టు ఎన్​.జాన్​ కామ్​ ట్వీట్ చేశారు. పారిస్​లో జరుగుతున్న అల్లర్లను యోగి ఆదిత్యనాథ్.. 24 గంటల్లో కట్టడి చేయగలరని ఆయన అన్నారు. జాన్ కామ్ చేసిన ట్వీట్​ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ ట్వీట్​పై యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం స్పందించింది. 'ప్రపంచంలో ఓ ప్రాంతంలోనైనా తీవ్రవాదం అల్లర్లకు ఆజ్యం పోసినప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఉత్తర్​ప్రదేశ్​లో నేరస్థులపై ఉక్కుపాదం మోపే 'యోగి మోడల్​'ను అనుసరించాలి. యోగి మోడల్​తోనే అల్లర్లను కట్టడి చేయవచ్చు' అని ట్వీట్ చేసింది.

యోగి ఆదిత్యనాథ్​పై ట్విట్టర్​ ద్వారా ప్రశంసలు కురిపించిన ప్రొఫెసర్​ ఎన్. జాన్​ కామ్ తనను తాను కార్డియాలజిస్ట్​గా పేర్కొన్నారు. అయితే.. నెటిజన్లు ఆయన ట్విట్టర్ ఐడీపై అనుమానాలు వ్యక్తం చేశారు. జాన్​కామ్​ ట్విట్టర్​ హ్యాండిల్ చీటింగ్ కేసులో అరెస్టైన డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్‌కు చెందినదని కామెంట్లు పెడుతున్నారు. మరికొద్ది మంది నెటిజన్లు యోగికి మద్దతు పలుకుతున్నారు. ఫ్రాన్స్​లో అల్లర్లను ఆయన 24 గంటల్లో నియంత్రించగలరని అంటున్నారు.

మరోవైపు.. జర్మనీ వైద్యుడు చేసిన ట్వీట్​పై యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం స్పందించడంపై AIMIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందని ఎద్దేవా చేశారు. ట్వీట్​ చేసిన వ్యక్తి ట్విట్టర్ ఖాతా నకిలీదని కూడా చూడలేదన్నారు. 'తప్పుడు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్లతో చట్టవిరుద్ధమైన చర్యలు, బలహీనులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమే ఉత్తర్​ప్రదేశ్​లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పని. ఇలా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే. 'యోగి మోడల్'​ను లఖింపుర్ ఖేరీ, హత్రాస్‌లో చూశాం' అని ఒవైసీ ట్వీట్ చేశారు.

Paris Riots Reason : 17 ఏళ్ల నహేల్‌ అనే యువకుడు ​పోలీసులు కాల్పుల్లో మరణించాడు. దీంతో ఫ్రాన్స్ రాజధాని పారిస్ గత నాలుగు రోజులుగా​ అట్టుడికిపోతోంది. ఇప్పటి వరకు 1,311 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారుల దాడుల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా గాయపడ్డారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించినప్పటికీ నిరసనకారులను అదుపు చేయడం కష‌్టంగా మారింది. పట్టపగలే కొందరు కొందరు తీవ్రస్థాయిలో హింసకు పాల్పడుతున్నారు. పారిస్​ సహా అనేక ప్రాంతాల్లో దుకాణాలను లూటీ చేస్తున్నారు.

వాహనాలకు నిప్పుపెట్టిన నిరసనకారులు
పారిస్​లో నిరసనకారులు

ABOUT THE AUTHOR

...view details