తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు ప్రధాని మోదీతో యోగి ఆదిత్యనాథ్ భేటీ! - యూపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై కథనాలు

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో గురువారం సమావేశమై పలు అంశాలపై చర్చించిన యోగి.. నేడు మోదీతో పాటు.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.

yogi adityanath
ప్రధాని మోదీతో భేటీ కానున్న యూపీ సీఎం

By

Published : Jun 11, 2021, 5:22 AM IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్​ దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్​ షాతో గురువారం భేటీ అయిన ఆదిత్యనాథ్.. నేడు మోదీతో సమావేశం కానున్నారు. ప్రధానితో పాటు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు సమాచారం.

మంత్రివర్గ పునర్​వ్యవస్థీకరణ?

శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటం సహా.. యూపీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందంటూ ఊహాగానాలు వెలువడుతున్న వేళ యోగి హస్తిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2022లో యూపీ శాసనసభకు జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ పునర్​వ్యవస్థీకరణ జరుగుతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి.

ఎమ్మెల్సీ ఏకే శర్మకు కేబినెట్‌లో కీలక బాధ్యతలు దక్కే అవకాశముందనే ఊహాగానాలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ చదవండి:దిల్లీకి యూపీ సీఎం యోగి- అందుకేనా?

మోదీపై శివసేన స్వరం మారిందా?

ABOUT THE AUTHOR

...view details