ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భోపురాలోని మురికివాడలో చెలరేగిన మంటల్లో అక్కడి గుడిసెలు కాలి బూడిదయ్యాయి.
మురికివాడ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అగ్నికీలల్ని ఆర్పేందుకు 8 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.
మురికివాడల్లోని ప్రజలంతా నిద్రిస్తున్న వేళ.. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు.
అయితే.. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:లారీలో మంటలు- లక్షల విలువైన సరకు దగ్ధం