తెలంగాణ

telangana

ETV Bharat / bharat

PPE Kit: వాడేసినవి మార్కెట్లో మళ్లీ విక్రయం! - పీపీఈ కిట్లను తిరిగి వాడకం

ఒక్కసారి పీపీఈ కిట్లను వాడిన తర్వాత వాటిని జాగ్రత్తగా డీకంపోజ్​ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, మధ్యప్రదేశ్​లోని ఓ ముఠా వాడిన పీపీఈ కిట్లను సేకరించి.. మళ్లీ ఉతికి విక్రయిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Used PPE kits
పీపీఈ కిట్లు

By

Published : May 27, 2021, 2:13 PM IST

వాడిన పీపీఈ కిట్లను విక్రయానికి సిద్ధం చేస్తున్న దృశ్యాలు

వైద్య పరికరాలను బ్లాక్​ మార్కెటింగ్​ చేయటంపై మధ్యప్రదేశ్​​ సతానా జిల్లాలో కేసు నమోదైంది. వాడిన పీపీఈ కిట్లను శుభ్రం చేసి మళ్లీ విక్రయిస్తున్న ఓ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. బడ్​ఖేరా గ్రామంలోని ఓ బయో వేస్ట్​ డిస్పోజల్​ ప్లాంట్​ ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం.

వేడీ నీళ్లతో ఉతికి..

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులను శాస్త్రీయ పద్ధతిలో నాశనం చేయాలి. కానీ, బడ్​ఖేరాలోని ఈ ప్లాంట్​లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాడేసిన పీపీఈ కిట్లను డీకంపోజ్​ చేయకుండా.. వేడి నీళ్లలో ఉతికి, మళ్లీ విక్రయించేందుకు ప్యాక్ చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దాంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని సబ్​డివిజనల్​ మేజిస్ట్రేట్​ రాజేష్​ సాహి తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చూడండి:Covid-19: కరోనా చేసిన ఘోరం- బిడ్డలకు తల్లి లాలన దూరం

ఇదీ చూడండి:Corona tests: కొవిడ్​ కట్టడిలో వ్యూహరాహిత్యం

ABOUT THE AUTHOR

...view details