తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అధిక యాంటీబయాటిక్సే బ్లాక్​ ఫంగస్​కు కారణం!

యాంటీబయాటిక్స్​ను అధికంగా వినియోగించిన వారు.. బ్లాక్​ ఫంగస్​ బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇంతకుముందు.. ఈ సమస్య తలెత్తడానికి కారణం స్టెరాయిడ్స్​ను విచక్షణారహితంగా వినియోగించడమేనని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది.

black fungus
బ్లాక్​ ఫంగస్

By

Published : May 24, 2021, 6:38 AM IST

కరోనా రోగుల్లో బ్లాక్​ ఫంగస్​ సమస్య తలెత్తడానికి కారణం స్టెరాయిడ్స్​ను విచక్షణారహితంగా వినియోగించడమేనని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడో కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్​లోని ఇందోర్​కు చెందిన మహాత్మాగాంధీ స్మారక వైద్య కళాశాలలో మెడిసిన్​ విభాగాధిపతి ప్రొఫెసర్​ వీపీ పాండే 210 మంది బ్లాక్​ ఫంగస్​ రోగులపై చేసిన అధ్యయన వివరాలను రాజీవ్​ జయదేవన్​ అనే వైద్యుడు ట్విట్టర్​లో పెట్టారు.

ఈ అధ్యయనం ప్రకారం బ్లాక్ ఫంగస్​ సోకిన వారిలో 14% మంది స్టెరాయిడ్స్​ ఉపయోగించలేదు. 21% మందికి మధుమేహం లేదు. 36% మంది రోగులు హోం ఐసోలేషన్​లోనే ఉన్నారు. 52% మంది రోగులు మాత్రమే బయటి నుంచి ఆక్సిజన్​ తీసుకున్నారు. జింక్​ వినియోగంపై ఇందులో అధ్యయనం చేయలేదని తెలిపారు. బ్లాక్​ ఫంగస్​ సోకిన రోగుల్లో 100% మంది యాంటీబయాటిక్స్​ తీసుకున్నట్లు అధ్యయనంలో తేలింది. "దీన్ని బట్టి చూస్తే.. ఈ ఇన్​ఫెక్షన్​ తలెత్తడానికి స్టెరాయిడ్స్​, మధుమేహానికి మించి ఇతరత్రా కారణాలున్నట్లు అనిపిస్తోంది. రోగులకు సూచించిన మందుల్లో అజిత్రోమైసిన్​, డాక్సీసైక్లిన్​, కార్బాపెనెమ్స్​ లాంటివి కనిపించాయి. అందువల్ల ఫంగల్​ ఇన్​ఫెక్షన్​ పెరగడానికి యాంటీ బయాటిక్సే కారణంగా కనిపిస్తోంది" అని జయదేవన్ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details