కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలుగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు ఆదివారం హోలీ పండగ సందర్భంగా 'హోలీ కా దహన్' మంటల్లో సాగు చట్టాల ప్రతులు తగలబెట్టినట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతుధరకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు.
సాగు చట్టాల ప్రతులతో హోలీ కా దహన్ - హోలీ కా దహన్ మంటల్లో సాగు చట్టాల ప్రతులు తగులబెట్టినట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేతలు
హోలీ పండగ సందర్భంగా 'హోలీ కా దహన్' మంటల్లో సాగు చట్టాల ప్రతులు తగలబెట్టినట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధరకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు.
![సాగు చట్టాల ప్రతులతో హోలీ కా దహన్ copies of cultivation laws were set on fire during the 'Holi Ka Dahan'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11197165-thumbnail-3x2-img.jpg)
సాగు చట్టాల ప్రతులతో హోలీ కా దహన్ చేసిన రైతులు
ఏప్రిల్ 5న 'ఎఫ్‌సీఐ బచావో దివస్' నిర్వహిస్తామని, ఆ రోజున ఉదయం 11.00 నుంచి సాయంత్రం అయిదింటి వరకు దేశవ్యాప్తంగా భారత ఆహార సంస్థ కార్యాలయాలను ఘెరావ్ చేస్తామని ప్రకటించారు. 'డ్యామేజి రికవరీ' పేరిట హరియాణా ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు ఆందోళనలను అణచివేసేలా ఉందంటూ ఖండించారు. పంజాబ్ రాష్ట్రంలోనూ పలుచోట్ల సాగు చట్టాల ప్రతులను హోలీ కా దహన్ మంటల్లో తగులబెట్టారు.
ఇదీ చదవండి:'భాజపా రాజకీయాలు కేరళలో పనిచేయవు'