తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇండోపసిఫిక్​ సుస్థిరతకు అమెరికా-భారత్​ బంధం కీలకం' - లాయిడ్ ఆస్టిన్

అమెరికా, భారత్ రక్షణ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, రాజ్​నాథ్​ సింగ్​ల మధ్య చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఇరుదేశాలూ రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, ఇండో పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు సహకరించుకోవాలని నిర్ణయించాయి.

US Defence Secretary attends wreath-laying ceremony at National War Memorial in Delhi
'శాంతి స్థాపనకు భారత్​తో బంధం పట్టుకొమ్మ వంటిది'

By

Published : Mar 20, 2021, 1:40 PM IST

దిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రుల అత్యున్నత స్థాయి సమావేశం శనివారం ముగిసింది. రక్షణ మంత్రులు రాజ్​నాథ్ సింగ్, లాయిడ్ జేమ్స్​ ఆస్టిన్ ఉన్నతాధికారులతో కలిసి భేటీ అయ్యారు. ఆస్టిన్​తో అద్భుతమైన, ఫలప్రద చర్చలు జరిగాయని రాజ్​నాథ్ పేర్కొన్నారు.

ఇరుదేశాల అత్యున్నత సమావేశం

"ఆస్టిన్​, ఆయన బృందంతో సమగ్రమైన భేటీ జరిగింది. ఎన్నో ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాలను సమీక్షించాం. ఎల్​ఈఎంఓఏ, కామ్​కాసా, బెకా ఒప్పందాలపై సంతకాలు చేశాం. భారత్-అమెరికా రక్షణ సంబంధాల బలోపేతానికి మరింత సహకరించుకోవాలని అంగీకరించాం. సైనిక విస్తరణ, సమాచార మార్పిడి, రవాణాలో పరస్పర సహకారం అందించాలని నిర్ణయించాం."

-రాజ్​నాథ్ సింగ్, భారత రక్షణ మంత్రి

ఈ సమావేశానికి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరయ్యారు.

హాజరైన త్రివిధ దళాల అధిపతులు

వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామ క్రమంలో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అన్నారు లాయిడ్ ఆస్టిన్. తమ ఇండో పసిఫిక్ విధానంలో భాగంగా భారత్​కు రక్షణ రంగంలో మరింత సహకారం అందిస్తామని తెలిపారు.

"ఇండో పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛ, సుస్థిరతలో భారత్-అమెరికా బంధం పట్టుకొమ్మ వంటింది. స్వేచ్ఛా నౌకాయానం, విమానయానం, వాణిజ్యానికి మోదీ హామీ ఇచ్చారు. ప్రాంతీయ భద్రతకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయి."

- లాయిడ్ ఆస్టిన్, అమెరికా రక్షణ మంత్రి

నివాళి అర్పిస్తున్న ఆస్టిన్

రాజ్​నాథ్​తో భేటీకి ముందు దిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు ఆస్టిన్. అనంతరం విజ్ఞాన్​ భవన్​లో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.

ఆస్టిన్​కు గౌరవ వందనం

మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న ఆస్టిన్​.. శుక్రవారమే భారత్​ చేరుకున్నారు. తొలి రోజు ప్రధాని మోదీ సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ ఢోబాల్​తో ఆయన సమావేశయ్యారు.

ఇదీ చూడండి:మోదీతో అమెరికా రక్షణ మంత్రి భేటీ

ABOUT THE AUTHOR

...view details